జూ కీపర్‌పై ఎలుగుబంటి ఆకస్మిక దాడి

జూ కీపర్‌పై ఎలుగుబంటి ఆకస్మిక దాడి

చైనాలోని ఓ సఫారీ పార్క్‌లో నిర్వహించిన ప్రదర్శనలో ఓ ఎలుగుబంటి కీపర్‌పై దాడి చేసింది. వెంటనే పక్కన ఉన్న సిబ్బంది అతడిని రక్షించారు. ఈ దాడిలో అతడికి ఎలాంటి ప్రమాదం జరగలేదని జూ అధికారులు వెల్లడించారు. కీపర్ బ్యాగులో క్యారెట్స్, యాపిల్స్ ఉన్నాయని.. ఆ వాసన రావడంతోనే అతడిపై దాడి చేసినట్లు తెలిపారు. అలాగే, ఎలుగుబంటిని ప్రదర్శనల నుంచి తొలగించినట్లు చెప్పారు.