ఈ నెల 24వ తేదీ నుంచి వేసవి క్రీడా శిబిరాలు
HNK: జిల్లాలో ఈ నెల 24 నుంచి జూన్ 7 వరకు వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహించనున్నట్లు DYSO కొత్త ప్రశాంత్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడలపై ఆసక్తి ఉన్న బాలబాలికలు ఆన్‌లైన్ https://satgasc.telangana.gov.inలో నమోదు చేసుకోవాలని సూచించారు. గ్రామీణ శిబిరాలు ఉచితం కాగా, పట్టణ శిబిరాలకు ఫీజులు వర్తిస్తాయని వెల్లడించారు.