పర్యాటక శాఖలో చారిత్రాత్మక ఒప్పందం

పర్యాటక శాఖలో చారిత్రాత్మక ఒప్పందం

AP: సీఎం చంద్రబాబు సమక్షంలో చారిత్రాత్మక ఒప్పందం కుదిరింది. తిరుపతి ఇండియన్ కలినరీ ఇనిస్టిట్యూట్‌తో పర్యాటక శాఖ ఒప్పందం చేసుకుంది. ఏపీని కలినరీ టూరిజం హబ్‌గా తీర్చిదిద్దేందుకు MOU కుదిరినట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలోని రుచులను ప్రపంచానికి పరిచయం చేస్తూ.. పర్యాటకులను ఆకర్షించేలా ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దనున్నారు.