పర్వతగిరిలో యూరియా కొరత లేదు: ఏవో

WGL: పర్వతగిరి మండల వ్యాప్తంగా యూరియా కొరత లేదని మండల వ్యవసాయ అధికారి ప్రశాంత్ కుమార్ గురువారం తెలిపారు. మండలానికి ఇప్పటికే 500 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని, వర్షాల కారణంగా మూడు రోజుల పాటు సరఫరాలో ఆలస్యం జరిగిందన్నారు. రైతులకు కావలసినంత యూరియా అందుబాటులో ఉందని, ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు.