RTC బస్సుల దోపిడి అంటూ ప్రజల ఆగ్రహం

HYD: ఎల్బీనగర్, ఆరాంఘర్ ప్రాంతాల నుంచి షాద్ నగర్ వైపు వెళ్లే పల్లె వెలుగు బస్సులకు ఎక్స్‌ప్రెస్ బోర్డులు ఏర్పాటు చేసి ఆర్టీసీ బస్సులు నడపటంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం రాత్రి ఆరాంఘర్ చౌరస్తా వద్ద ప్రయాణికులు అందరూ కలిసి ప్రశ్నించారు. పల్లె వెలుగు వసతులకు, ఎక్స్‌ప్రెస్ బోర్డులు పెట్టి చార్జీలు వసూలు చేయడం ఏంటన్నారు. దీని పై ఎండి సజ్జనార్ స్పందించాలని డిమాండ్ చేశారు.