మార్చురీ వద్ద దాహం కేకలు..!
NLG: నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ వద్ద కనీస సౌకర్యాలు కరువయ్యాయి. మండుతున్న ఎండల్లో మృతదేహాల కోసం వచ్చే బంధువులకు తాగడానికి మంచినీళ్లు దొరకడం లేదు. దీంతో బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతూ చెట్ల నీడనే ఆశ్రయిస్తున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఆసుపత్రిలో ఇంతటి దయనీయ స్థితి ఉండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.