రైతులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి

రైతులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి

AP: రాష్ట్రానికి తుఫాన్ ముప్పు నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. రానున్న 48 గంటల్లో తుఫాన్ తీవ్రత పెరిగే ప్రమాదం ఉందన్నారు. తాను ఇప్పటికే అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు చెప్పారు. పంట విషయంలో రైతులు ముందు జాగ్రత్తతో వ్యవహరించాలని కోరారు. వరి కోతలు కోసిన రైతులు వెంటనే తమ పంటను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు.