BRS, కాంగ్రెస్ యువతను మోసం చేశాయి: బండి సంజయ్

TG: రాష్ట్రంలోని ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు, విద్యార్థుల సమస్యలపై కేంద్రమంత్రి బండి సంజయ్ స్పందించారు. BRS, కాంగ్రెస్ పార్టీలు యువతను మోసం చేశాయని ఆరోపించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించక ప్రైవేటు కళాశాలలు మూతపడే దుస్థితికి వచ్చాయని అన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ రాకపోవడంతో విద్యార్థులు తమ సర్టిఫికెట్లను కళాశాలల నుంచి తీసుకోలేకపోతున్నారని ఫైర్ అయ్యారు.