సర్పంచులు, వార్డు సభ్యులకు ఘన సన్మానం
CTR: గంగాధర నెల్లూరు నియోజకవర్గం కొత్తపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని 49 కొత్తపల్లి మిట్ట దీపిక కళ్యాణమండపంలో సర్పంచులు, వార్డు సభ్యులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త కృపా లక్ష్మి, మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి పాల్గొని మాట్లాడారు. గ్రామాభివృద్ధిలో స్థానిక ప్రజాప్రతినిధుల పాత్ర కీలకమని పేర్కొన్నారు.