'వినాయక చవితి మండపాలకు అనుమతి తప్పనిసరి'

GNTR: పొన్నూరులో వినాయక చవితి మండపాలకు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని తెనాలి డీఎస్పీ జనార్ధనరావు తెలిపారు. బుధవారం సాయంత్రం పొన్నూరు అర్బన్ స్టేషన్‌లో డీజే సౌండ్ సిస్టం యజమానులు చవితి మండపాల నిర్వాహకులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రజలకు ఇబ్బంది కలిగించకుండా డీజే సౌండ్ సిస్టం ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు.