భద్రాద్రి సంప్రదాయాల మార్పుపై రగడ

భద్రాద్రి సంప్రదాయాల మార్పుపై రగడ

TG: భద్రాచలం రామాలయ కళ్యాణ సంప్రదాయాల్లో మార్పులపై విశ్వ హిందూ రక్షా పరిషత్ జాతీయ మహిళా అధ్యక్షురాలు యమునా పాఠక్ అభ్యంతరం వ్యక్తం చేశారు. గోత్ర నామాల మార్పు శతాబ్దాల ఆచారాలకు విరుద్ధమని, ఇది అధికారుల నిర్లక్ష్యమని మండిపడ్డారు. వెంటనే పాత పద్ధతులను పునరుద్ధరించి ఆలయ పవిత్రతను కాపాడాలని డిమాండ్ చేశారు. భక్తుల మనోభావాల దృష్ట్యా ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని ఆమె కోరారు.