కొత్త వీధిలో త్రాగునీటి కష్టాలు..!

AKP: చీడికాడ (M) కోనాంలోని కొత్త వీధిలో నివసిస్తున్న ఆదివాసి గిరిజన కుటుంబాలకు త్రాగునీటి కష్టాలు ఏర్పడ్డాయి. తాగేందుకు నీరు లేక గ్రామ శివారులో గల ఊట గడ్డ వద్దకు వెళ్లి ఆకులు, అలములు తొలగించి త్రాగునీటిని తెచ్చుకుంటున్నారు. దీంతో కలుషిత నీటిని త్రాగుతూ.. అనారోగ్యాల బారిన పడుతున్నామని వాపోతున్నారు. అధికారులు స్పందించి తమకు తాగునీటి సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు.