కన్నీటిని మిగిల్చిన వడగండ్ల వాన

కన్నీటిని మిగిల్చిన వడగండ్ల వాన

KMR: భిక్కనూర్ మండలం పెద్దమల్లారెడ్డి శివారులో మంగళవారం సాయంత్రం కురిసిన వడగండ్ల వానకు రైతులు తీవ్రంగా నష్టపోయారు. వరి పంట పూర్తిగా దెబ్బతిని వడ్లు రాలిపోయాయని గ్రామానికి చెందిన మహిళ రైతు వెంకటలక్ష్మి కన్నీటి పర్యంతమయ్యారు. అకాల వర్షానికి చేతికందిన పంట పూర్తిగా దెబ్బతిన్నదని వాపోయారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.