పోలీసు వెల్ఫేర్ డే నిర్వహించిన ఎస్పీ

VZM: జిల్లా పోలీసుశాఖలో పని చేస్తున్న అధికారులు, సిబ్బంది సమస్యల పరిష్కారానికి ఎస్పీ వకుల్ జిందాల్ జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం 'పోలీసు వెల్ఫేర్ డే' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిబ్బందిని తన ఛాంబర్‌లోకి పిలిచి, వారి వ్యక్తిగత, వృత్తిపరమైన, శాఖాపరమైన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారి నుంచి వినతులు స్వీకరించారు.