VIDEO: దేవనకొండలో ఘనంగా అయ్యప్ప పడిపూజ
KRNL: దేవనకొండలో అయ్యప్ప స్వామి పడిపూజను భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక పూజల అనంతరం స్వాములు సంప్రదాయ వేషధారణలో నృత్యాలు చేస్తూ గ్రామంలో ఊరేగింపుగా ముందుకు నడిచారు. పిల్లలు కలశాలు పట్టుకొని కళాత్మక ప్రదర్శనలు ఇస్తూ, భజనలు, నినాదాలతో పురవీధుల గుండా ఊరేగింపు సాగింది. దీంతో గ్రామం మొత్తం భక్తి, ఉత్సాహంతో కళకళలాడింది.