గుత్తి కోటను ప్రతి ఒక్కరు సందర్శించాలి: జిల్లా కలెక్టర్
ATP: గుత్తి కోటను ప్రతి ఒక్కరు సందర్శించాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. గుత్తి కోట ఉత్సవాలలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఉత్సవాలు రెండు రోజులపాటు జరుగుతాయన్నారు. ఈ ఉత్సవాలను జిల్లా పర్యటకశాఖ ఆధ్వర్యంలో రూ.50 లక్షల నిధులతో చేస్తున్నామన్నారు. భవిష్యత్తులో ఈ గుత్తి కోట ఉత్సవాలను మరింత వైభవంగా నిర్వహిస్తామని వారు పేర్కొన్నారు.