'వారసత్వ రాజకీయాలతో దేశానికి ముప్పు'
SRCL: కుటుంబ, వారసత్వ రాజకీయాలతో దేశానికి పెనుముప్పు పొంచి ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలో సర్దార్ 150వ యూనిటీ మార్చ్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. దేశ రాజకీయాల్లో యువతను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని, ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్‌ను ఆదర్శంగా తీసుకుని యువత ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు.