రేపు తాగునీటి సరఫరాకు అంతరాయం
AKP: ఎలమంచిలి మున్సిపాలిటీ పరిధిలో ఈనెల 9న పాత వీధి, కాకవాని వీధి, దిమిలి రోడ్డు, కొత్త ఎర్రవరం ప్రాంతాల్లో త్రాగునీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ రాజు తెలిపారు. మిగిలిన చోట్ల పాక్షికంగా సరఫరా చేస్తామన్నారు. ఎర్రవరం సంపు క్లీనింగ్ చేసిన కారణంగా వాటర్ పంపింగ్ ఆలస్యం అవుతుందన్నారు. ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తామన్నారు.