'ఆయిల్ పామ్ పంట సాగు విస్తీర్ణాన్ని పెంచాలి'
MNCL: జిల్లాలో ఆయిల్ పామ్ పంట సాగు విస్తీర్ణాన్ని పెంచాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం నస్పూర్‌లోని కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ ఆయిల్ పామ్ పంట సాగుతో కలిగే లబ్ధిపై రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు. జిల్లాలో 2 వేల ఎకరాలో సాగు లక్ష్యం కాగా ఇప్పటి వరకు 438 ఎకరాలలో సాగవుతోందని తెలిపారు.