మీర్‌పేట్‌లో కారు బీభత్సం
రంగారెడ్డి జిల్లా మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో కారు బీభత్సం సృష్టించింది. బాలాపూర్ నుంచి మందమల్లమ్మ చౌరస్తా ప్రధాన రహదారిపై దాదు నగర్ సమీపంలో అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.