డిజిటల్ మోసం కేసులో ప్రధాన నిందితుడి అరెస్ట్

విశాఖలో ఓ వృద్ధుడిని డిజిటల్ అరెస్టు పేరిట మోసం చేసి రూ. 1.60 కోట్లు కాజేసిన కేసులో ప్రధాన నిందితుడిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఇప్పటికే నలుగురిని అరెస్టు చేయగా ప్రధాన నిందితుడు యూపీలోని బరేలి ప్రాంతానికి చెందిన ఆకాష్ యాదవ్‌ను శుక్రవారం సాయంత్రం అరెస్టు చేసి రిమాండ్‌కి తరలించినట్లు సైబర్‌క్రైమ్ పోలీసులు తెలిపారు.