పిల్లలమర్రి శివాలయంలో ప్రత్యేక పూజలు

పిల్లలమర్రి శివాలయంలో ప్రత్యేక పూజలు

సూర్యాపేట మున్సిపాలిటీ స్థానిక పిల్లలమర్రి గ్రామంలోని చారిత్రాత్మకమైన 12వ శతాబ్దానికి చెందిన కాకతీయుల కాలం నాటి శివాలయంలో నేడు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పరమశివునికి ప్రత్యేకంగా కుంకుమార్చనలు, బిల్వార్చన, నీరాజనం మంత్రపుష్పం ఘనంగా జరిగింది. కార్తీక మాస ఉత్సవాల్లో భాగంగా ఆరుద్ర నక్షత్రం సందర్భంగా రెండు శివాలయాల్లో ఉన్న బ్రహ్మసూత్ర శివలింగాలకి పంచామృతాలు చేశారు.