పాత రుసుములతోనే ట్రేడ్ లైసెన్స్ ఫీజు: మంత్రి

పాత రుసుములతోనే ట్రేడ్ లైసెన్స్ ఫీజు: మంత్రి

కర్నూలు నగర వ్యాపారస్తులు ట్రేడ్ లైసెన్స్ ఫీజులను పాత రుసుముల ప్రకారమే చెల్లించాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. పెంచిన ధరలను ప్రస్తుతానికి అమలు చేయవద్దని మున్సిపల్ అధికారులను గురువారం ఆదేశించారు. గత పాలకవర్గం ఫీజులు పెంచుతూ తీసుకున్న నిర్ణయంపై మంత్రి ఈ మేరకు స్పందించారు. దీంతో నగరంలోని వ్యాపార వర్గాలకు పెద్ద ఊరట లభించింది.