అగ్నికి ఆహుతైన అరటి తోట

అగ్నికి ఆహుతైన అరటి తోట

ప్రకాశం: గిద్దలూరు మండలం గడికోట పంచాయితీ పరిధిలోని పరమేశ్వర గ్రామంలో అరటి తోట అగ్నికి ఆహుతైంది. పి. సుబ్బలక్ష్మి అనే మహిళా రైతుకు చెందిన సుమారు ఆరున్నర ఎకరాల తోట మంటల్లో కాలిపోయినట్లు సమాచారం. స్థానిక అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించినప్పటికీ, వారు చేరుకునేలోపే నష్టం వాటిల్లిందని తెలుస్తోంది. ఈ ఘటనతో బాధిత రైతు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.