ఏయూ శతాబ్ది వేడుకల్లో సాంస్కృతిక సందడి
VSP: ఏయూ శతాబ్ది ఉత్సవాల మెగా కల్చరల్ ఫెస్ట్ మంగళవారం రాత్రి అట్టహాసంగా జరిగాయి. ఎంపీ ఎం. శ్రీభరత్, సినీ నటుడు శివాజి ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థులను ఉత్సాహపరిచారు. ఏయూను ప్రపంచ స్థాయి వర్సిటీగా తీర్చిదిద్దాలని శ్రీభరత్ ఆకాంక్షించగా, యువత ఒత్తిడి లేకుండా లక్ష్యాల దిశగా సాగాలని శివాజీ సూచించారు.