పన్నులు వసూళ్ళకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు: కమిషనర్

పన్నులు వసూళ్ళకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు: కమిషనర్

VZM: బకాయిలు ఉన్న ఇంటి, నీటి పన్నుల వసూళ్లలో భాగంగా బుధవారం రాజాం మున్సిపల్‌ కమిషనర్‌ రామచంద్రరావు స్థానిక బుచ్చెంపేట సచివాలయ పరిధిలో పర్యటించారు. ఈ సందర్భంగా రూ.4 కోట్ల డిమాండ్‌కు గానూ ఇప్పటివరకు రూ.2.54 కోట్ల వసూలు చేసినట్లు ఆయన తెలిపారు. మిగిలిన రూ.1.46 కోట్లు వసూలు చేయటానికి పురపాలక సంఘ ఉద్యోగులతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామన్నారు.