VIDEO: జస్వంతి మృతి కలకలం.. స్కూల్ ఎదుట ఉద్రిక్తత!
KDP: కడపలోని శ్రీ చైతన్య స్కూల్ హాస్టల్‌లో విద్యార్థిని జస్వంతి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. తమ కూతురు మృతికి పాఠశాల యాజమాన్యమే కారణమని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. రిమ్స్ ఆస్పత్రి నుంచి మృతదేహాన్ని తీసుకుని రింగ్ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా, వారిని పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదానికి దిగారు. దీంతో మృతదేహంతో రింగ్ రోడ్డుపైనే ఆందోళనకు దిగారు.