రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

నాగర్‌కర్నూల్: వంగూరు గేటు సమీపంలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో డిండి మండలం నగర దుబ్బ తండాకు చెందిన రామకోటి(60) మృతి చెందాడని స్థానికులు తెలిపారు. డిండి నుంచి కల్వకుర్తి వైపు బైక్‌పై వస్తుండగా రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రాక్టర్‌ను వెనుక నుంచి ఢీకొట్టడంతో అతడు అక్కడికక్కడే మృతిచెందినట్లు స్థానిక ఎస్సై మహేందర్ చెప్పారు.