'తొర్రూరు మున్సిపాలిటీ పై కాంగ్రెస్ జెండా ఎగరాలి'
MHBD: తొర్రూరు డివిజన్ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇవాళ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. ఆ సమావేశంలో పాల్గొన్న పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి మాట్లాడుతూ.. మున్సిపాలిటీలో ఉన్న 16 వార్డులలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలని, ఈ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి అత్యంత కీలకమని అన్నారు. ప్రజల నమ్మకాన్ని బలపరుచుకునేందుకు ఇదే అవకాశమని పేర్కొన్నారు.