దివ్యాంగులకు అండగా ఎంపీ వేమిరెడ్డి

NLR: నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వందలాదిమంది దివ్యాంగులను ఆదుకుంటున్న ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఆదివారం నెల్లూరులోని ఆయన నివాసంలో మరో ముగ్గురు దివ్యాంగులకు ట్రై సైకిళ్లు అందచేశారు. అనంతసాగరం మండలం ముస్తాపురం, పాతాళ్ళపల్లి గ్రామాలకు చెందిన నందిమండలం వెంకట సుబ్బరాజు, లక్షిదేవి, కాకాణి సంజీవయ్యలకు ఎంపీ చేతులు మీదుగా ట్రై సైకిళ్లను అందజేశారు.