రాజీవ్ గాంధీ చేసిన సేవలు మరువలేనివి: ఎమ్మెల్యే

KMR: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అన్నారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన జయంతిని ఘనంగా నిర్వహించారు. రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశ ప్రధానిగా ఎన్నో సంస్కరణలు తీసుకు వచ్చారని గుర్తు చేశారు. యువత రాజకీయాల్లోకి వచ్చే విధంగా ఎంతో కృషి చేశారని తెలిపారు.