అయ్యప్ప స్వాములకు శుభవార్త
అయ్యప్ప స్వాములకు శబరిమల ఆలయ అధికారులు శుభవార్త చెప్పారు. రేపటి నుంచి ఆన్‌లైన్ బుకింగ్ చేసుకున్న భక్తులకు అయ్యప్ప దర్శనం కల్పించనున్నట్లు తెలిపారు. భారీ రద్దీని దృష్టిలో ఉంచుకుని పథనంతిట్ట జనరల్ ఆసుపత్రిలో ఎమర్జెన్సీ కార్డియాలజీ చికిత్స అందుబాటులో ఉంచారు. అలాగే శబరిమల చరిత్రలో తొలిసారి పంపాబేస్, సన్నిధానం వద్ద ఆపరేషన్ థియేటర్లను ఏర్పాటు చేశారు.