వక్ఫ్ భూమికి హద్దులు నిర్ణయించాలని కలెక్టర్‌కు వినతి
BHNG: రాజాపేట మండలం పారుపల్లి గ్రామంలోని వక్ఫ్ భూమిని సర్వే చేసి హద్దులు నిర్ణయించాలని కోరుతూ.. ముస్లిం మైనార్టీ నాయకులు సోమవారం భువనగిరిలో జిల్లా కలెక్టర్ హనుమంతరావుకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ నాయకులు మహ్మద్ అక్బర్ పాషా, మహ్మద్ అస్గర్ పాషా, తదితరులు పాల్గొన్నారు.