ఈనెల 20న ఉద్యోగ మేళా

ఈనెల 20న ఉద్యోగ మేళా

WGL: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐలో ఈనెల 20న ప్రైవేట్ ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కార్యాలయం తెలిపింది. ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ద్వారా జరిగే ఈ ఇంటర్వ్యూలలో హాస్పిటాలిటీ, ఆటోమోటివ్, ఎలక్ట్రికల్ సోలార్, హెల్త్‌కేర్, డేటా ఎంట్రీ, బ్యూటీషియన్ వంటి విభాగాల్లో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.