డేంజర్.. ఆ ఫోన్ కాల్స్‌కు స్పందించకండి: SE సూచనలు

CTR: విద్యుత్ వినియోగదారులకు అపరిచితుల నుంచి వచ్చే మోసపూరిత ఫోన్ కాల్స్‌పై స్పందించవద్దని జిల్లా ఎస్ఈ ఇస్మాయిల్ అహ్మద్ పేర్కొన్నారు. సైబర్నేరగాళ్లు విద్యుత్ సంస్థల పేరిట వినియోగదారులకు 'మీ విద్యుత్ బిల్లు పెండింగ్లో ఉంది.. వెంటనే చెల్లించకపోతే సరఫరా నిలిపేస్తార'ని.. సెల్ ఫోన్‌లో సందేశాలు పంపుతున్నారన్నారు. విద్యుత్తు శాఖ కాల్స్, సందేశాలు పంపదన్నారు.