'నరకప్రాయంగా మారిన రహదారి'
ASF: వాంకిడి మండలం జైత్పూర్, బోర్డ గ్రామాలకు వెళ్లే BT రోడ్లు అధ్వానంగా మారింది. కొన్నేళ్ల నుంచి బీటీ రోడ్లు మరమ్మతులకు నోచుకోక పోవటంతో ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్లు దెబ్బతిన్నాయి. రోడ్లపై బీటీ, కంకర లేచిపోయి గుంతలు పడ్డాయి. దీంతో ప్రయాణం నరకంగా మారిందని వాహనదారులు, ప్రయాణికులు వాపోతున్నారు. అధికారులు రోడ్లకు మరమ్మతులు చేయించాలని కోరారు.