అల్లూరులో స్వచ్ఛ ఆంధ్ర - స్వచ్ఛ దివస్ కార్యక్రమం

అల్లూరులో స్వచ్ఛ ఆంధ్ర - స్వచ్ఛ దివస్ కార్యక్రమం

NLR: అల్లూరు మండలంలోని పురిణి పంచాయితీ పరిధిలో ఇవాళ స్వచ్ఛ ఆంధ్ర - స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక ప్రజలకు తడి చెత్త, పొడి చెత్తపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ చేశారు. పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రతి ఒక్కరు అవగాహన ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ తాండ్ర శ్రీనివాసులు, పంచాయితీ కార్యదర్శి సిద్దేశ్వరి, పాల్గొన్నారు.