తాండూరులో కమ్యూనిటీ హాల్ శిలాఫలకం ధ్వంసం
VKB: తాండూరు పట్టణం ఇందిరా నగర్‌లో గుర్తుతెలియని వ్యక్తులు బొందిలి రాజ్‌పుత్ సమాజం కమ్యూనిటీ హాల్ శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. ఈ ఘటనపై ఆదివారం రాజ్‌పుత్ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు. వార్డు నంబర్ 5లో ప్రభుత్వం కేటాయించిన స్థలంలో ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిని వెంటనే గుర్తించి, కఠిన చర్యలు తీసుకోవాలని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.