నేడు జిల్లాలో పర్యటించనున్న గొట్టిపాటి

నేడు జిల్లాలో పర్యటించనున్న గొట్టిపాటి

BPT: రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదివారం బాపట్ల జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. మంత్రి కార్యాలయ వర్గాల సమాచారం ప్రకారం పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి. ఉదయం 8:30 గంటలకు సంతమాగులూరు మండలం పుట్టావారిపాలెంలోని అతిథి గృహానికి మంత్రి చేరుకుంటారు. ఉదయం 10 గంటలకు బల్లికురవ మండలం కె.రాజుపాలెంలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు.