రైతుల్లో నమ్మకం పెంచేందుకు కృషి చేయండి: కలెక్టర్

కృష్ణా: జిల్లాలో యూరియా సరఫరా నిరంతరం కొనసాగుతుందని, రైతులలో నమ్మకం పెంపొందించేందుకు కృషి చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. యూరియా సరఫరాపై శనివారం ఆయన అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. మన గ్రోమోర్ కేంద్రాల నుంచి వీలైనంత వరకు యూరియాను గ్రామాలకు తీసుకొని వెళ్లి అక్కడి రైతులకు పంపిణీ సాఫీగా చేయాలని ఆదేశించారు.