టోలిచౌకిలో అగ్ని ప్రమాదం
HYD: నగరంలో మరో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. టోలిచౌకిలోని సెవెన్ టూంబ్స్ సబ్‌స్టేషన్ ప్రాంతంలో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. ఈ ప్రమాద సమయంలో సమీప మసీదులో 2వేల మంది ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అప్రమత్తమైన మసీదు కమిటీ మహిళలు, చిన్నారులను సురక్షితంగా బయటికి పంపారు. ముందు జాగ్రత్తగా అధికారులు విద్యుత్ నిలిపివేశారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.