హిందూపురం వచ్చే.. వందే భారత్ రైలు ఆగే..!

సత్యసాయి: యశ్వంతపూర్ నుంచి కాచిగూడ వెళ్లే వందే భారత్ రైలు హిందూపురంలో ఆగేందుకు రైల్వే ఉన్నతాధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రైలు ఇంతకు ముందు యశ్వంతపూర్ నుంచి ధర్మవరం మీదుగా కాచిగూడ వెళ్లేది. హిందూపురం ప్రజల కోరిక మేరకు ఎంపీ బీకే పార్థసారధి రైల్వే శాఖ మంత్రి సోమన్నను కలిసి హిందూపురంలో రైలు ఆగేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు.