VIDEO: గర్భాశయ క్యాన్సర్ నివారణకు HPV వ్యాక్సిన్: MLA
SKLM: గర్భాశయ క్యాన్సర్ నివారణకు HPV వ్యాక్సిన్ కీలకం అని శ్రీకాకుళం ఎమ్మెల్యే శంకర్ అన్నారు. మంగళవారం నగరంలోని కంపోస్ట్ కాలనీ పీహెచ్‌సీలో ఉచిత HPV వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ వ్యాక్సిన్‌ను బయట కొనుగోలు చేస్తే సుమారు రూ. 4 వేలు ఖర్చవుతుందని, అయితే ప్రభుత్వం దీనిని పూర్తిగా ఉచితంగా అందిస్తుందన్నారు.