24 నుంచి తుంగభద్ర డ్యామ్ గేట్ల బిగింపు పనులు

24 నుంచి తుంగభద్ర డ్యామ్ గేట్ల బిగింపు పనులు

ATP: జిల్లా ప్రజలకు తాగు, సాగు నీరు అందించే తుంగభద్ర డ్యామ్ గేట్ల బిగింపు పనులు డిసెంబర్ 24 నుంచి ప్రారంభం కానున్నాయి. తుంగభద్ర బోర్డు ప్రకటించిన వివరాల ప్రకారం మొదటగా గేట్ నెం. 18ను బిగించనున్నారు. ప్రతినెలా 8 గేట్లను అమర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తుంగభద్ర బోర్డు అధికారులు తెలిపారు. పనులను త్వరగా పూర్తి చేయడానికి కార్యాచరణ రూపొందించారు.