'వికలాంగుల పెన్షన్‌లను తక్షణమే పునరుద్ధరించాలి'

PPM: మన్యం జిల్లాలో వివిధ కారణాలను సాకుగా చూపించి 2 వేల మంది వికలాంగుల పెన్షన్‌లను రద్దు చేసేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టడం పట్ల సీపీఎం పార్టీ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఇవాళ పార్వతీపురం సీపీఎం జిల్లా కార్యదర్శి గంగునాయుడు మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఆర్భాటంగా హామీల వర్షం కురిపించిన కూటమి నేతలు పెన్షన్లు సంక్షేమ పథకాలు కుదించడం సరికాదున్నారు.