దాతలు ముందుకు రావాలి: కలెక్టర్ చేతన్

సత్యసాయి: వరద ప్రభావిత ప్రజలను ఆదుకునేందుకు మానవతా దృక్పథంతో దాతలు ముందుకు రావాలని కలెక్టర్ టీఎస్ చేతన్ పిలుపునిచ్చారు. బుధవారం మధ్యాహ్నం ఆయన మాట్లాడుతూ.. కోస్తా ఆంధ్రాలో వరదల్లో చిక్కుకుపోయిన ప్రజల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని అన్నారు. వారికి ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తోందని, ప్రజలు కూడా ముందుకు రావాలని కోరారు.