జిల్లాకు ఆకస్మిక వరద సూచన
NLR: గత వారం రోజులుగా 'దిత్వా' తుఫాన్ ఎఫెక్ట్‌తో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాగల 24 గంటల్లో నెల్లూరు జిల్లాల్లో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. భారీ వర్ష సూచన పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎప్పటికప్పుడు అధికారుల సూచనలు పాటించాలన్నారు. అనవసరమైన ప్రయాణాలు చేయకూడదని తెలిపారు.