ఈనెల 15న కళ్యాణ వేంకన్నకు పుష్పయాగం
TPT: శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈ నెల 15న పుష్పయాగం నిర్వహించనున్నారు. ఉదయం స్నపన తిరుమంజనం, మధ్యాహ్నం పుష్పయాగం జరుగుతాయని అధికారులు తెలిపారు. ఈ సేవకు రూ. 516 టికెట్‌తో ఇద్దరు భక్తులు పాల్గొనవచ్చు. పుష్పయాగం కారణంగా ఆ రోజు నిత్య కళ్యాణోత్సవాన్ని టీటీడీ రద్దు చేసింది.