'లబ్ధిదారుల సంక్షేమానికి అధికారులు ప్రాధాన్యతనివ్వాలి'

SRD: లబ్ధిదారుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ అధికారులు కృషి చేయాలని జహీరాబాద్ ఎంపీ సురేష్ శెట్కార్ అన్నారు. సంగారెడ్డిలో జరిగిన దిశా కమిటీ సమావేశంలో పాల్గొన్న ఆయన జిల్లాలో అమలవుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు స్థితిగతులపై సమీక్షించారు. దిశ నివేదికలను పరిశీలించి వాటి పురోగతిపై చర్చించారు. కేంద్ర పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు.