జిల్లా కలెక్టర్‌ను అభినందించిన సీఎస్ శాంతి కుమారి

ఖమ్మం: శ్రీరామనవమి మహోత్సవ వేడుకలు దిగ్విజయంగా నిర్వహించడం పట్ల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరపున స్వామి వారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించిన సీఎస్ వేడుకలు అత్యంత వైభవోపేతంగా నిర్వహించడం పట్ల దేవస్థానం కమిషనర్ హనుమంతరావును భద్రాద్రి జిల్లా కలెక్టర్ ప్రియాంక అల, ఎస్పీ రోహిత్ రాజ్ ను అభినందించారు.